ఇకపై ఆ రూల్ తప్పనిసరి.. ప్లేయర్ల విషయంలో ఆస్ట్రేలియా క్రికెట్ గొప్ప నిర్ణయం 

ఇకపై ఆ రూల్ తప్పనిసరి.. ప్లేయర్ల విషయంలో ఆస్ట్రేలియా క్రికెట్ గొప్ప నిర్ణయం 

సాధారణంగా ఆస్ట్రేలియాలో బౌన్సీ పిచ్ లు ఉంటాయి. అయితే ఈ పిచ్ లు వారికే ప్రమాదం తీసుకొస్తాయని ఎవరూ ఊహించి ఉండరు. కేవలం ఒక బౌన్స్ కారణంగా 2014 లో ఫిలిప్ హ్యూజ్ మరంచిన సంగతి తెలిసిందే. బౌన్సర్లను ఎదుర్కొనే క్రమంలో తల వెనుక తీవ్ర గాయంతో విలవిల్లాడిన హ్యూజ్.. ప్రాణాలతో పోరాడి మరణించాడు. ఇక 2019 యాషెస్ లో భాగంగా ఆర్చర్ బౌన్సర్  ఎదుర్కొనే క్రమంలో స్మిత్ హెల్మెట్ విరిగిపడింది. దీంతో స్మిత్ కి ఏమైనా అయిందని అందరూ భయపడ్డారు. అయితే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు గొప్ప నిర్ణయం తీసుకుంది.            

ఇకపై  నెక్ ప్రొటెక్టర్‌ తప్పనిసరి

ఆస్ట్రేలియా క్రికెట్ లో ఇక కొత్త రూల్ వచ్చి చేరింది. ఇకపై బ్యాటింగ్ కి దిగే వారందరూ తప్పనిసరిగా నెక్ ప్రొటెక్టర్‌లను ధరించాలని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆదేశాలు  జారీ చేసింది. డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడే ఆటగాళ్లందరికి ఈ రూల్ వర్తిస్తుంది. అక్టోబర్ 1 నుంచి ఈ రూల్ అమలులోకి తీసుకురానున్నారు. అయితే 2015లో డేవిడ్ వార్నర్,స్టీవ్ స్మిత్‌లతో సహా అనేక మంది టాప్ బ్యాట్స్‌మెన్ ఈ నెక్ ప్రొటెక్టర్‌ ధరించడానికి నిరాకరించారు. దీంతో ఈ రూల్ పాటించని ఆటగాళ్లకు కఠిన చర్యలు తప్పవని ఆసీస్ బోర్డు హెచ్చరించింది. ప్రస్తుతం ఈ రూల్ పట్ల నెటిజన్స్ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.  

ALSO READ: పాక్ కాదు వన్డేల్లో టీమిండియానే నెంబర్ వన్.. కానీ అలా జరగాలి